మాచర్లలో బంద్‌ ఉద్రిక్తం

మాచర్ల: విద్యుత్‌ కోతలు నిరసనగా గుంటూరు జిల్లా మాచర్లలో వైకాపా చేపట్టిన బంద్‌ ఘర్షఫ వాతావరణానికి దారితీసింది. బంద్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు నిరసనగా పోలీసులతో వైకాపా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకొని ఘర్షణకు దారి తీసింది.