మాజీ టెన్ట్ క్రికెటర్ కన్నుమూత
ముంబయి: భారతీయ మాజీ టెస్ట్ క్రికెటర్ రూసీ ఫ్రామ్‌రోజ్ సుర్తి ఈరోజు ఉదయం ముంబయిలోని ఒక ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆస్ట్రేలియాలో ఉంటున్నసుర్తి సెలవులు గడపడానికి భారత్ వచ్చారు. కొద్దిరోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూసినట్లు ఆయనతో పాటు టెస్ట్ క్రికెట్ ఆడిన నారీ కాంట్రాక్టర్ తెలిపారు. సుర్తి కుమారులిద్దరూ చివరి ఘడియల్లో ఆయన వద్ద ఉన్నారని కాంట్రాక్టర్ పేర్కొన్నారు. 1960లలో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ,1962లో నారీ కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో సుర్తి టెన్ట్ క్రికెట్ ఆడారు తలకు బంతి తగిలి తీవ్రంగా గాయపడిన ఆయన తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు.