మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి వలిగొండ.
వలిగొండ జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 2. మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి13 వర్ధంతి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సందర్భంగా ఎంపీపీ నూతి రమేష్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య విద్య 108 104 ఆరోగ్యశ్రీ ఎన్నో అభివృద్ధి పథకాలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు విధానాన్ని తీసుకో వచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని కొన్ని యాడరు. ఈ కార్యక్రమంలో పాశం సత్తిరెడ్డి కంకాల కిష్టయ్య మాజీ సింగిల్విండో చైర్మన్ వాకిటి అనంతరెడ్డి బోళ్ళ శ్రీనివాస్ పల్లెర్ల సుధాకర్ ఖుర్షద్ వెంకట పాపిరెడ్డి బండారి నర్సిరెడ్డి శెమ్మయ్య కొమరయ్య . కాసుల వెంకన్న పాలకూర వెంకటేశం కొండూరు సాయి ధనుంజయ రమేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.