మార్కెట్ కమిటీ చైర్మన్ ని కలిసిన కురుమ సంఘం నాయకులు
బచ్చన్నపేట (జనం సాక్షి) మార్చ్ 16:
జనగామ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన బాల్దే సిద్ధి లింగమును బచ్చన్నపేట మండల కురుమ సంఘం నాయకులు కలిసి అభినందనలు తెలిపినట్లు కురుమ సంఘం మండల అధ్యక్షులు జంగిటి సిద్దులు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ. మార్కెట్ కమిటీ చైర్మన్గా కురుమ కులానికి చెందిన వారిని నియమించడం ఎంతో సంతోషం అన్నారు . పెంబర్తిలోని ఆయన నివాసంలో కలిసి సన్మానించడం జరిగింది అన్నారు. మేకల కవిత రాజు. మీసా ఐలి మల్లయ్య. శీను. ఎంపీటీసీ మల్గనరసమ్మ సిద్ధిరాములు. కొమురవెల్లి మాజీ డైరెక్టర్ జూకంటి కిష్టయ్య. కరిక కరుణాకర్. ఏనుగుల రాములు. ఏనుగుల కనకయ్య. గున్నాల సందీప్. ఉన్నారు