మినీ లారీతో సహా ఎర్రచందనం దహనం

తిరుపతి : తిరుపతి గ్రామీణ మండలంలోని పేరూరు చెరువులో మంగళవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు మినీ లారీతో సహా ఎర్రచందనం దుంగలను దహనం చేశారు. అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు పేరూరు చెరువుకు చేరుకున్నారు. దీన్ని  గమనించిన స్మగ్లర్లు లారీతో సహా దుంగలను తగలబెట్టి అక్కడి నుంచి పరారయ్యారు.