ముంబయి జలమయం:ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు

ముంబయి:నిన్నటినుంచి ఎడతేరపి లేకుండా కురుస్తున్న వానతో ముంబయినగరం జలమయమైంది.పలు లోతట్టు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచింది.దాంతో వాహనాల రాకపోకల తీవ్ర ఇబ్బందులు ఎదురువుతున్నాయి.లోకల్‌ రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.మరో 24 గంటలపాటు వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.