ముంబయి దాడుల కుట్రదారుల స్వర నమూనాలను ఇవ్వాల్సిందిగా పాకిస్థాన్‌కు విజ్ఞప్తి

మాల్దీవులు: ముంబయి దాడుల కుట్రదారుల స్వర నమూనాలను ఇవ్వాల్సిందిగా భారత్‌ పాకిస్థాన్‌కు మరోమారు విజ్ఞప్తి చేసింది. 26/11 దాడుల నిందితులపై విచారణను వేగవంతం చేయాలని, సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపాలని కోరింది. సార్క్‌ హోం మంత్రుల సమావేశం సందర్భంగా భారత హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, పాకిస్థాన్‌ అంతర్గత వ్వవహారాల మంత్రి రెహ్మాన్‌ మాలిక్‌లు బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.