ముంబయి పోలీసుల కస్టడీకి జుందాల్
ముంబయి: 26/11 ముంబయి దాడుల్లో కీలక నిందితుడిగా భావిస్తున్న అబుజుందాల్‌ను ముంబయి ఉగ్రవాద వ్యతిరేక దళం ఈ రోజు న్యాయస్థానంలో ప్రవేశపెట్టనుంది. న్యూఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్న జుందాల్‌ను ముంబయి పోలీసులకు విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీన్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. దీంతో జుందాల్‌ను తమ అదుపులోకి తీసుకున్న ముంబయి పోలీసులు నేడు అతన్ని ముంబయి చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్త్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. 26/11 దాడులకు సంబంధించి జుందాల్‌ను విచారిస్తే మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశముంది.


