ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తి లేదు
హైదరాబాద్: ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తి లేదని ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి తెలియజేశారు. మారుస్తారంటూ వస్తున్న వూహాగానాలకు విశ్వసనీయత లేదన్నారు. ధర్మాన రాజీనామాపై ముఖ్యమంత్రి, అధిష్టానం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పీసీసీ, డీసీసీ కమిటీల పునర్‌వ్యవస్థీకరణ, నామినేటెడ్ పదవులను త్వరలో భర్తీ చేస్తామన్నారు.