ముఖ్య మంత్రి సహాయ నిది పేదలకు వరం
కొండపాక (జనంసాక్షి) సెప్టెంబరు 03; ముఖ్య మంత్రి సహాయ నిది పేదలకు వరం అని మంగోల్ సర్పంచ్ కిరణ్ కుమార్ చారి అన్నారు.. కొండపాక మండల పరిధిలోని మంగోల్ గ్రామానికీ చెందిన ముసినం చందుకి రూ 60 వేలు, తోడని రమేశ్ కు రూ 24 వేల రూపాయలు ముఖ్య మంత్రి సహాయ నిది కింద మంజూరైన చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి ఎంతగానో ఉయోగపడుతోంది అని అన్నారు. ఈ కార్యక్రమములో ఉపసర్పంచ్ కల్పనకనకరాజు , వార్డు మెంబర్లు అనిలు, కనకయ్య, కర్ణకర్, షాహిన్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.