ముగిసిన ట్రైన్ ఐఏఎస్ ల విలేజ్ టూర్ ప్రోగ్రాం
జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామం లో గత వారం రోజులుగా జరుగుతున్న సివిల్ సర్వీసెస్ ట్రైనీ అధికారుల విలేజ్ స్టడీ టూర్ శుక్రవారంతో ముగిసినది. చివరి రోజున సమావేశం ఏర్పాటు చేసి సర్పంచ్ బూడిద మల్లేష్ కి విలేజ్ విసిట్ రిపోర్ట్ సమర్పించడం జరిగింది . సమావేశంలో గత వారం రోజులుగా గ్రామంలో లోని అభివృద్ధి పనుల ను పరిశీలించి పాలకవర్గాన్ని అభినందించడం జరిగినది మరియు అన్ని శాఖల పని తీరుపై పరిశీలించిన విషయాలను సమావేశంలో వివరించడం జరిగింది. అలాగే సలహాలు సూచనలు, ఇవ్వడం జరిగింది. ముగింపు సమావేశం అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో సివిల్ సర్వీస్ ఆఫీసర్లు అభిషేక్ తివారి, జాగ్రతి, గోయల్, అనిషా, గోహార్, సుజిత్, పాదన్ , లక్ష్మీనారాయణ వర్మ పేర్ల మీద గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. అలాగే గ్రామంలోని రైతు వేదిక భవనంలో కంటి వెలుగు కార్యక్రమం ను ట్రైనీ అధికారులతో పాటు సర్పంచ్ ప్రారంభించడం జరిగింది. అనంతరం గ్రామ పాలకవర్గం, గ్రామస్థాయి ఉద్యోగులు గ్రామస్తులు ట్రైనీ సివిల్ సర్వీసు ఆఫీసర్లకు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికినారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బెల్లంకొండ భాస్కర్ రెడ్డి వార్డు సభ్యులు బూడిద జైపాల్, మద్దెల మల్లేశ్వరి, దాసరి తార, ఎంపీడీవో బి రమేష్ ఎంపీ ఓ ఆరిఫ్ హుస్సేన్ ఏఈవో స్రవంతి కో ఆప్షన్ మెంబర్ బి రాజయ్య, పంచాయతీ కార్యదర్శి అనిల్ పల్లె, గ్రామస్థాయి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.