ముదిరాజ్‌ మహాసభ 8న

సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లా ముదిరాజ్‌ల మహాసభ ఈ నెల 8న తొగుట మండలంలోని కొటి లింగాల ఆశ్రమంలో  మహాసభ నిర్వహిస్తున్నట్లు  అధ్యక్షుడు చంద్రశేఖర్‌,  గౌరవ అధ్యక్షుడు టి. నారాయణ, ప్రధాన కార్యదర్శి నారయణ,కోశాధికారి మల్లేశంలు పేర్కొన్నారు.సభకు ముఖ్య అతిధిగా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ హాజరవుతున్నారని తెలిపారు. ముదిరాజ్‌లు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనాలని తెలియజేశారు.