ముని-3 చిత్రీకరణ ప్రారంభం

హైదరాబాద్‌: ముని, కాంచన వంటి హారర్‌ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన లారెన్స్‌ వాటికి సీక్వెల్‌గా ముని-3 మొదలు పెట్టారు. ఈ చిత్రం చిత్రీకరణ రోజు అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. లారెన్స్‌, తాప్సీలపై  ముహూర్తపు సన్నివేశానికి దాసరి నారాయణరావు క్లావ్‌ కొట్టగా, నందినీ రెడ్డి కెమెరా స్విచాన్‌ చేశారు. ముని, కాంచన కంటే ముని-3 ప్రేక్షకులను మరింత భయపెట్టనుందని లారెన్స్‌ తెలిపారు. శ్రీ సాయిగణేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.