మున్సిపల్ కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి – సయ్యద్ జలీల్ పాషా
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపల్ కాంట్రాక్టర్స్ యూనియన్ నూతన అధ్యక్షులు సయ్యద్ జలీల్ పాషా అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆ సంఘ సభ్యులు జలీల్ పాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.అనంతరం కాంట్రాక్టర్లు జలీల్ పాషాను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు హలీం, బత్తుల సురేష్, మోత్కూరి సందీప్, వెంకట్రాజు, బాబూజీ రావు, జాటోత్ రాజేష్ నాయక్, ఆరిఫ్, బొమ్మ సురేష్, భూక్య మహేష్, నాగు నాయక్, శివరాత్రి రవి, వీరయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Related