మురళి పరామర్శించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి …
మురళి ఆసుపత్రిలో పరామర్శిస్తున్న ఎమ్మెల్యే
వరంగల్ బ్యూరో: సెప్టెంబర్ 28 (జనం సాక్షి)
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ములుక మురళి ఈటీవీ రిపోర్టర్ ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆసుపత్రిలో పరామర్శించి భరోసానిచ్చారు.
బుధవారం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో ములుక మురళి పరామర్శించి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. గత కొన్ని నెలలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఇటీవల నిమ్స్ హాస్పిటల్ నందు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసుకున్న నర్సంపేట డివిజన్ రిపోర్టర్ దుగ్గొండి మండలం, నాచినపల్లి గ్రామ వాస్తవ్యులు మురళిని హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ఎస్ డి ఆరోగ్య విభాగం , నిమ్స్ ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. గంగాధర్ పరామర్శించారు.