బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి
బిజెపి ఆధ్వర్యంలో ధర్నా..
గంభీరావుపేట ఏప్రిల్ 10(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట గంభీరావుపేట మధ్యగల వాగు వంతెన పై బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని బిజెపి నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు, మండల అధ్యక్షులు కోడె రమేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం బిఆర్ఎస్, అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేతగాని ప్రభుత్వాలని, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ బ్రిడ్జి నిర్మాణ పనులపై మాట్లాడటం లేదని, బిజెపి నాయకులు ఆరోపించారు, బ్రిడ్జి వంతెన పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 28 నెలలు,గడుస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు, మూడు జిల్లాలకు సంబంధించిన ప్రధాన రహదారి, రైతులకు వ్యాపారులకు, విద్యార్థులకు, ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బ్రిడ్జి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు, వాజిద్ హుస్సేన్, జిల్లాబిజెపి అధికార ప్రతినిధి, దేవసాని కృష్ణ, మండల ఉపాధ్యక్షులు, మోహన్, ప్రధాన కార్యదర్శులు, మల్లేష్ యాదవ్, విగ్నేష్, సోషల్ మీడియా కన్వీనర్, కొక్కు దేవేందర్ యాదవ్, బిజెపి సీనియర్ కార్యకర్తలు డాక్టర్ సత్యనారాయణ, ఎల్లం రాజు, రాకేష్, నరేష్, రాజు, సీనియర్ కార్యకర్తలు, బిజెపి నాయకులు పాల్గొన్నారు


