ముస్లిం పోలీసు అధికారుల్ని నియమించండి

ముస్లిం పోలీసు అధికారుల్ని   నియమించండి

ముస్లిం జనాభా ఉన్నచోట

న్యూఢిల్లీ :

రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశం

సచార్‌ కమిటీ సిఫార్సును అమలు చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ నెలాఖరు వరకు ఈ విషయమై పురోగతి నివేదిక పంపాలని కేంద్ర హోం కార్యదర్శి ఆర్‌.కె.సింగ్‌ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులవర్తమానం పంపారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతా ల్లోని పోలీస్‌ స్టేషన్లలో కనీసం ముస్లిం ఇన్‌స్పెక్టర్‌ లేదా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను నియమించాలని సచార్‌ కమిటీ సిఫార్సు చేసింది. వివక్షను రూపు మాపే విషయంలా కాకుండా ముస్లింలలో విశ్వాసం పాదుకొల్పే చర్యగా ఈ సిఫార్సు చేస్తున్నట్లు కమిటీ అప్పట్లో పేర్కొంది.