మూడవ రోజు అత్యంత వైభవంగా కోదండరామ స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు

మూడవ రోజు అత్యంత వైభవంగా కోదండరామ స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలుఇటిక్యాల జనంసాక్షి) మార్చి 29 : మండల పరిధిలోని బీచుపల్లి పుణ్య క్షేత్రంలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో బుధవారం మూడవ రోజు వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం సుప్రభాత సేవ, తిరువారాధన, యాగశాల ఆరాధనలు, మూల మంత్ర మూర్తి హోమాలు, ధన్వంతరి యాగం, నవ కలశ స్నపనం వంటి కార్యక్రమాలు జరిగాయి. అలాగే సాయంత్రం యాగశాల ఆరాధనలు, మూలమంత్రమూర్తి హోమాలు, మరియు శ్రీ సుదర్శన యాగం, లఘు పూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సుదర్శన్ నారాయణ స్వామి, శిష్య బృందం, ఆలయ అర్చకులు ఉన్నారు.