మూడు కోట్ల 66 లక్షల తో ప్రిండిప్రోలు గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందాళ…
మూడు కోట్ల 66 లక్షల తో ప్రిండిప్రోలు గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందాళ
ఖమ్మం తిరుమలాయపాలేం (సెప్టెంబర్ 27) జనం సాక్షి. తిరుమలాయపాలేం మండలంలోని ప్రిండిప్రోలు గ్రామంలో 2 కోట్లతో నిర్మిస్తున్న ప్రిండిప్రోలు-మన్నేగూడెం వయా చిలక్కోయలపాడు రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ,స్థానిక ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ,ఎంపీ
నామానాగేశ్వరరావు ,వద్ధిరాజు రవిచంద్ర ,ఎమ్మెల్సీ తాత మధుసూదన్1 కోటి 50 లక్షలతో నూతనంగా నిర్మించిన 33/11 KV విద్యుత్ సబ్ స్టేషన్ మరియు 16 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్నిప్రారంభించారు.స్వాతంత్య్ర సమరయోధుడు,తెలంగాణ ఉద్యమ నేత,బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ బోడా మంగీలాల్. బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.