మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఆపన్న హస్తం అందించిన సర్పంచ్ పోతుల నరసయ్య
వీణవంక మార్చి 11 (జనం సాక్షి) వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోతుల మల్లమ్మ అనారోగ్యంగా ఈ రోజు మృతి చెందగా విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పోతుల నర్సయ్య. మృతి చెందిన పోతుల మల్లమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబానికి సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వారి కుటుంబ సభ్యులకు 2000 రూపాయలను ఆర్థిక సాయం అందజేశారు. వారి వెంట పోతుల సురేష్,నర్సయ్య, చంద్రయ్య, స్వామి, అశోక్, కిరణ్, కాగిత శ్రీనివాస్, ఎలబాక రాజయ్య తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు