మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
కేసముద్రం ఆగస్టు 30జనం సాక్షి /మంగళవారము మండలంలోని ఇనుగుర్తి గ్రామంలో కొత్తూరి లక్ష్మయ్య ముదిరాజ్ స్వర్గస్తులవగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ దహన ఖర్చుల నిమిత్తం 5000 /-రూపాయలు పంపించగా వారి స్వగృహంలో ముదిరాజ్ జిల్లా నాయకులు నీలం దుర్గేష్ వారి కుటుంబ సభ్యులకు అందయజేయడం జరిగినది .ఈ కార్యక్రమములో సొసైటీ చైర్మెన్ దికొండ వెంకన్న ,సర్పంచ్ దార్ల రామూర్తీ ,బానోతు రామన్న ,ఎంపీటీసీ పింగిలి శ్రీనివాస్ ,ఉపసర్పంచ్ దేవేందర్ ,టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు చంద్రయ్య ,టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి మహేందర్ పాల్గొన్నారు .