మెగా రక్తదాన శిబిరం నిర్వహించిన టిఎస్ఆర్టిసి
అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 27
అల్వాల్ టిఎస్ఆర్టిసి హకీంపేట్ డిపోలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజనార్ ఆదేశాల మేరకు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛందంగా ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని రక్త దానం చేయడం జరిగింది. ముఖ్యంగా తుమ్ముకుంట మున్సిపాలిటీలోని విశ్వవిశ్వాని పీజీ కాలేజ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. దీనికి సహకరించిన విశ్వవిశ్వాని కాలేజ్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన డిపో మేనేజర్ భవభూతి ఒక పిలుపుమేరకు వచ్చి రక్తదానం చేసిన ప్రతిఒక్కరికిమనస్ఫూర్తిగాధన్ యవాదాలుతెలియజేసినారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సునీత, మెకానికల్ ఫోర్ మెన్ రవికాంత్, ఓఎస్ ఆంజనేయులు, రామచంద్రం, సూపర్వైజర్లు ఆర్ఆర్ రెడ్డి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జెఎస్ రెడ్డి, గోపు శ్రీనివాస్, రమణ, తులసి రామ్, పవన్ కుమార్ యాదవ్, రమేష్, కాంగ్రెస్ తుంకుంట మున్సిపాలిటీ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.