మెజిస్టీరియల్‌ విచారణ బహిష్కరిస్తాం !

సంతబొమ్మాళి : కాకరపల్లి ధర్మల్‌ ఉద్యమంలో భాగంగా గతేడాది పోలీసులు జరిపిన కాలుపలపై ఈ నెల 17న నిర్వహించనున్న మెజిస్టీరియల్‌ విచారణను తాము బహిష్కరిస్తున్నట్లు థర్మల్‌ పోరాట వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు సుబ్బిరామిరెడ్డి తెలిపారు. 695 రోజులుగా వడ్డితాండ్ర గ్రామంలో నిర్వహిస్తున్న థర్మల్‌ వ్యతిరేక రిలే నిరాహార దీక్షల్లో ఆకాశ లక్కవరం పంచాయతీకి చెందిన 39 మంది రైతులు మంగళవారం దీక్షల్లో పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం థర్మల్‌ యాజమాన్యం ప్రస్తుతం జరుపుతున్న పనులను ఆపాలని డిమాండ్‌ చేశారు.