మెడికల్‌ ఆన్‌లైన్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభం

విజయవాడ:2012-13 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్‌, బీడీఎన్‌ సీట్లకు మొదటి విడత కౌన్సిలింగ్‌ 4 ఆన్‌లైన్‌ కేంద్రాల్లో ప్రారంభమైంది. విజయవాడలోని డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఎంసెట్‌ రెండవ ర్యాంకర్‌ పవన్‌కుమార్‌ ఉస్మానియాలో నాన్‌ లోకల్‌ సీటు తీసుకున్నారు. ఈ కౌన్సిలింగ్‌కు ఎంబీబీఎస్‌లో 3,880, బీడీఎస్‌లో 1131 సీట్లను అందుబాటులో ఉంచారు. కౌన్సిలింగ్‌ ప్రక్రియ ఈ నెల 27వరకు జరుగుతుంది.