మైసూరా నీచ రాజకీయవాది

కడప, మే 27 (జనంసాక్షి):

తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు పొందిన మైసూరారెడ్డి పార్టీని విడిచి వెళ్లడం నీచమైనదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్దన్‌రెడ్డి ఆరోపించారు. దీర్ఘకాలికంగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో ఉన్న విభేదాలతో తెలుగుదేశం పార్టీలో చేరి ఉన్నత పదవులు పొందిన మైసూరారెడ్డి రాజశేఖర్‌రెడ్డి కుమారుడి పంచన చేరడం నీతిబా హ్యా చర్యగా అన్నారు. పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించలేదన్న ఆవేదనతో మైసూరా పార్టీని విడిచి వెళ్లారనడం లో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. పార్టీలో చేరిన కొంతకాలానికి రాజ్యసభ సభ్యునిగా పార్టీ అధిష్ఠాన వర్గం ఎంపి క చేసిందని చెప్పారు. అంతే కాకుండా పోలిట్‌ బ్యూరోలో స్థానం కలిగించిందని అన్నా రు. పార్టీ వల్ల ఆయనకు ఏవిధమైన అన్యాయం జరిగిందో చెప్పాలన్నారు.