మొక్కజొన్న పంటలను పరిశీలించిన అదనపు కలెక్టర్ 

మొక్కజొన్న పంటలను పరిశీలించిన అదనపు కలెక్టర్
బోనకల్ ,మార్చి 21 ( జనంసాక్షి):మండలంలోని లక్ష్మీపురం, గార్లపాడు, రామాపురం గ్రామాలలో ఈదురు గాలులు , అకాల వర్షం వలన దెబ్బతిన్న మొక్కజొన్న పంటను ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ రావు పరిశీలించారు.జరిగిన పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి పంపిస్తాము అని రైతులకి తెలియజేసారు.రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా వస్తాయో రావో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయాలలో దిగుబడులు తగ్గి రైతులు నష్టపోతున్నారు.  మిర్చి పంట  రైతులు కూలీలతో కోయించి కల్లాలలో ఆరబెడుతున్నారు. ఈ అకాల వర్షాలకు కాయ తడిచి రంగు మారే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాగులు, వంకల పరిసరాల్లో సాగు చేసిన రైతులు పంటలు పూర్తిగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోతున్నారు.  పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.యాసంగి పంటలు చేతికొస్తున్న సమయంలో అకాల వర్షాలు మళ్లీ నష్టాలు చేకూరుస్తున్నాయని కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు లబోదిబోమంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో  రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలని పలువురు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎమ్. విజయనిర్మల , డిప్యూటీ తహశీల్ధార్  శ్వేతా , మండల వ్యవసాయ అధికారి ఏ. శరత్ బాబు , గిర్దావర్ జి.సత్యనారాయణ ,   మండల రైతు బంధు సమితి అధ్యక్షులు వేమూరి ప్రసాద్ , వ్యవసాయ విస్తరణ అధికారి బి. శ్రీకాంత్, సర్పంచులు గోవిందాపురం (ఎల్)వి. బాబు , ఉప సర్పంచ్ (లక్ష్మీపురం)జి. ఉమ , గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షులు కేతినేని సత్యనారాయణ (గార్లపాడు), వెనిగెళ్ళ మురళి (లక్ష్మీపురం), గార్లపాడు ఎంపిటిసి ముక్కపాటి అప్పారావు  , ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.