మోడీకి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ : గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర లోకాయుక్తగా విశ్రాంత న్యాయమూర్తి ఆర్‌ఏ మిశ్రా నియామకం సరైనదేనని కోర్టు తీర్పును వెలువరించింది. రాష్ట్ర కెబినెట్‌ను సంప్రదించకుండా గవర్నర్‌ కమలా బెనివాల్‌ లోకాయుక్తను నియమించడాన్ని సవాల్‌ చేస్తూ మోడీ సుప్రీంను ఆశ్రయించారు.