మోనోరైల్‌ వంతెన కూలి ఒకరి మృతి

ముంబయి: ముంబయిలోని వడాలా వద్ద శాంతినగర్‌లో ఈస్ట్రన్‌ రైల్వేకు చెందిన ఓ మోనోరైల్‌ వంతెన కూలి ఒకరి మృతి చెందారు. వంతెనలోని ఓ భాగం అకస్మాత్తుగా కూలి కింద ప్రయాణిస్తున్న వాహనాలపై పడింది. దీంతో దానికింద ఉన్న ఓ ట్రక్కు పూర్తిగా నాశనమైంది. ఆసమయంలో అక్కడున్న వాహనాల్లో 9మంది శిధిలాల్లో చిక్కుకుపోయారు. వీరిని సమీప ఆసుపత్రికి చికిత్సకోసం  తరలించారు. అక్కడ ఒకరి మృతి చెందారు. మోనోరైతు వంతెన ఈసన్‌ ఎక్స్‌ప్రెస్‌వేకు చెందినది. ఇది దక్షిణ ముంబయిని నవీముంబయిని కలిపే మార్గంలో ఉంది.