మోపిదేవి కేర్‌ ఆస్పత్రికి తరలింపు

హైదారాబాద్‌, మే 27 : సీబీఐ కస్టడీలో ఉన్న మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను సీబీఐ అధికారులు కేర్‌ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.అధిక రక్తపోటు వల్ల మోపిదేవి కళ్లు తిరిగి పడిపోయినట్లుగా తెలుస్తోంది. జగన్‌ అక్రమాస్తుల కేసుల తనను అన్యాయంగా అరెస్టు చేశారని మూడురోజుల నుంచి మానసికంగా మోపిదేవి వేదన పడుతున్నట్లు సమాచారం. దీంతో హైబీపీ పెరిగి కళ్లు తిరుగుతూ ఉండొచ్చని భావిస్తున్నారు.