మౌలాలీలో మహిళ హత్య
హైదరాబాద్: మౌలాలీ వడ్డెర బస్తీలో లక్ష్మీ అనే మహిళ (50) హత్యకు గురైంది. కూలీ చేసుకుంటూ జీవించే లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు ఆమెను కత్తితో పొడిచి చంపారు. ఆమె ఒంటిపై ఉన్న నగలు మాయమవడంతో ఇది దొంగల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.