యూపిఏలోనే కొనసాగుతాం : ప్రపుల్‌ పటేల్‌

న్యూఢిల్లీ : తాము ఎప్పటినుంచో యూపీఏలో భాగసామ్యపక్షంలో ఉన్నామని ఇకాముందు కూడా అలాగే కొనసాగతామని  ఎన్సిపీ నేత కేంద్రమంత్రి ప్రపుల్‌ పటేల్‌ తెలిపారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తమపై అనవసరంగా దుష్ప్రచారం జరుగుతుందని అన్నారు. తాము మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని విషయం నిజమేనని దానాపై నిన్న సాయంత్రమే ప్రధాని, ఈ రోజు ఉదయం సోనియాగాంధీ పవార్‌తో మాట్లాడారని అయాన అన్నారు. శరద్‌పవార్‌కు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలో ఎంపీల సంఖ్యను బట్టి నిర్ణయం జరగదని ఆయన అన్నారు. ప్రభుత్వం తక్షణం పరీశిలించవలిసిన అంశంపై పవార్‌ గత సాయంత్రం ప్రధానికి లేఖ రాసిన మాట నిజమేనని అయితే అందులోని అంశాలను కొందరు వ్యక్తులు వక్రీకరిస్తున్నారని అన్నారు. లేఖలోని అంశాలేమిటో మాత్రం అయన మీడియాకు తెలియజేయలేదు.