రంగారెడ్డి జిల్లాలో రవాణా శాఖ విస్తృత తనిఖీలు
రంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 165 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీటీసీ రమేష్ తెలియజేశారు. వాహనాల యజమానులకు రూ. 8 లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు.