రాగల 24 గంటల్లో భారీ వర్షలు

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అప్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చకికల కేంద్రం తెలిపింది. వీటికి తోడు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్ధిరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.