రాజీనామాలు వెనక్కి తీసుకొండి

బెంగళూరు: కార్ణాటకలో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భాజపా అధిష్ఠానం ప్రయత్నాలు ప్రారంభించింది.యడ్యూరప్ప మద్దతుదారులు తమ మంత్రి పదవులకు చేసిన రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి ధర్మేంద్ర ప్రధాన్‌ బెంగళూరులో కోరారు.ప్రధాన్‌ ఢిల్లీకి బయలుదేరే ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో మీడియాతో మాట్లాడారు.9 మంది మంత్రులు తమ రాజీనామాలను వెనక్కితీసుకొని సమస్య పరిష్కారానికి దారి చూపాలని కోరారు.రాష్ట్ర పరిస్థితులను అధిష్ఠానం పెద్దలకు వివరిస్తానని వారు త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారని అశిస్తున్నట్లు చెప్పారు.