రాజ్‌భవన్ రోడ్డులో ట్రాఫఙక్ ఆంక్షలు
నేటి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్,ఫిబ్రవరి18(జనంసాక్షి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో రాజ్‌భవన్‌లో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 11:30 గంటలకు మంత్రివర్గ విస్తరణ జరుగనున్న విషయం తెలిసిందే. దీంతో రాజ్‌భవన్ పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించారు. వాహనాల రాకపోకలప ఆంక్షలు విధించారు. ఉదయం రాజ్‌భవన్ రోడ్డులో వాహనాలను అనుమతించ మని పోలీసులు తెలిపారు. అలాగే ప్రమాణ స్వీకారోత్సవానికి రాజ్‌భవన్ లాన్స్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కొత్త మంత్రుల చేత ప్రమాణం చేయిస్తారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది రిహార్సల్ నిర్వహించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు. రాజ్‌భవన్ రోడ్డులో ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నారు.
కొత్త మంత్రుల జాబితా సోమవారం సాయంత్రానికి విడుదలయ్యే అవకాశముందని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో పాటు ¬ంమంత్రి మహమూద్ అలీ, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఇతర
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రొటోకాల్ విభాగం నుంచి ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు అందాయి.