రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారింది : దత్తాత్రేయ

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ అసమర్థత వల్ల ప్రతిభ కలిగిన విద్యార్థులకు మంచి ఇంజనీరింగ్‌ కళాశాలల్లో సీట్లు దొరక్కుండా పోతోందని భాజపా సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. హైదరాబాద్‌ ఎన్‌కేఎమ్‌ గ్రాండ్‌ హోటల్‌లో కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన సుప్రీంకోర్టు న్యాయవాది భూపేందర్‌సింగ్‌ యాదవ్‌ను సన్మానించిన ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వాలకు కాలం చెల్లిందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.