రాష్ట్రంలో యువజన కాంగ్రెస్‌ ఎన్నికలు ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్రంలో యువజన కాంగ్రెస్‌ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే ఈ ఎన్నికల్లో రాష్ట్ర కమిటీతో పాటు అన్ని శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాలకు కమిటీలను ఎన్నుకోనున్నారు. మొత్తం 35,600 మంది కాంగ్రెస్‌ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. లోక్‌సభ నియోజ కవర్గానికి రెండు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు 14 న చేపట్టనున్నారు.