రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం నెలకొంది: మంత్రి ఆనం

నెల్లూరు: రాష్ట్రంలో విద్యుత్‌ రంగం కుంటుపడటానికి ఉచిత విద్యుత్తే కారణమని రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మన బడ్జెట్‌లో విద్యుత్‌ రంగానికి రూ.5,850కోట్లు కేటాయిస్తున్నా ఉచిత విద్యుత్‌ చెల్లింపులకే అవి సరిపోతున్నాయని మంత్రి చెప్పారు. గతకొన్ని సంవత్సరాలుగా జరిగిన నిర్లక్షయం వల్లనే నేడు రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం నెలకొందని అభిప్రాయపడ్డారు. మిగిలిన రాష్ట్రాలు మనకన్నా తక్కువ బడ్జెట్‌ కేటాయిస్తున్నా అవి విద్యుత్‌ రంగంలో మనకంటే మెరుగ్గా ముందున్నాయన్నారు.