రాష్ట్రంలో 11మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ-జీవో విడుదల

హైదరాబాద్‌: రాష్ట్రంలో తాజాగా 11 మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వాణీ ప్రసాద్‌, విశాఖ కలెక్టర్‌గా శేషాద్రి, పర్యాటక సంస్థ ఎండీగా కాంతీలాల్‌ దండే, సర్వే సెటిల్‌మెంట్‌ కమిషనర్‌గా రామంజనేయులు, డిల్లీ ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమీషనర్‌గా శశాంగ్‌ గోయల్‌, ప్రాథమిక విద్య స్పెషల్‌ సీఎస్‌గా ఇంద్రజిత్‌పాల్ను, సాదారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా రాంకుమార్‌ సిన్హా, గృహ నిర్మాణ శాఖ ముఖ్య సెక్రటరీగా కరికల వలవన్‌, పరిశ్రమల శాఖ కమీషనర్‌గా రజత్‌కుమార్‌, గ్రేటర్‌ విశాఖ కమీషనర్‌గా సత్యనారయణ, పంచాయితీరాజ్‌ సీఈవోగా ఎం.రఘునందనరావులను ఆయా శాఖల్లో నియమించారు.