రాష్ట్రంలో 223 మి.మీ వర్షపాతం నమోదు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ రోజు వరకు 223 మి.మీ వర్షపాతం నమోదైందని విపత్తు నిర్వహణ శాఖ డి.డి. రత్నకుమార్‌ తెలిపారు. కోస్తాంధ్రలో సగటు కంటే 12 శాతం, తెలంగాణలో ఒకశాతం అధికంగా నమోదుకాగా రాయలసీమలో 6 శాతం తక్కువగా నమోదైందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో శుక్రవారం రాత్రి 8.30 నుంచి శనివారం ఉదయం 8.30 వరకు 15.2 సెంమీ. వర్షం పడిందన్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 9 మంది మృతి చెందినట్లు తెలియజేశారు.