రాష్ట్రం ఆధోగతికి సోనియానే కారణం

విశాక: చావర్షాకాలంలోనూ కరెంటు కోతలు విధిస్తున్న ఘనత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే దక్కుతుందని తెదేపా ఆరోపించింది. రాష్ట్రం అంధకారంలో కూరు కుపోవటానికి, పారిశ్రామికవేత్తలే, మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు జైళ్లకు వెళ్లడానికి సోనియాగాంధీయే కారణమని ఆ పార్టీ సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపింరు. దేశంలో జరుగుతున్న అన్ని కుంభకోణాల్లో సోనియా పాత్ర ఉందన్నారు. సోనియా, రాహుల్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయబరేలి, అమేధీల్లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్‌ ఓడిపోయిందని నైతికంగా వీరు దేశాన్ని పాలించే హక్కును కోల్పోయారని ఓడిపోయిందని నైతికంగా వీరు దేశాన్ని పాలించే హక్కును కోల్పోయారని వ్యాఖ్యానించారు. అవినీతిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటానికి సోనియానే కారణమని ఆరోపించారు.