రాష్ట్రానికి కావాల్సిన గ్యాస్‌, బొగ్గును సరఫరా చేయాలని డిమాండ్‌ : నాగేశ్వరరావు

కూసుమంచి: గ్యాస్‌, బొగ్గు కేటాయింపుల్లో కోత విధిస్తూ కేంద్రం మన రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తోందని తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మిగతా రాష్ట్రాలకు 95 శాతం నుంచి కేటాయింపులకు మించి 105 శాతం వరకు అనుమతిస్తున్న కేంద్రం మన రాష్ట్రానికి మాత్రం 30 శాతం కోత విధించి 70 శాతం మాత్రమే కేటాయిస్తోందన్నారు. ప్టాంట& లోడ్‌ ఫ్యాక్లర్‌ (పీఎల్‌ఎఫ్‌) 95 శాతం నడిపేందుకు రాష్ట్రానికి కావాల్సిన గ్యాస్‌ బొగ్గును సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. వ్వవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామని. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రస్తుతం మూడు గంటలకు మించి సరఫరా చేయడం లేదన్నారు. సమావేశంలో తెదేపా నాయకురాలు స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.