రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చింది కాంగ్రెస్ పార్టీయే : శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చిందని వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన విషయంలో గందరగోళానికి గురి చేస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీమాంధ్రలో ఉద్యమం లేదన్న కేంద్రమంత్రి వాయలార్ రవి వ్యాఖ్యలను ఖండించిన శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర ఆత్మగౌరవాన్ని మంత్రులు ఢిల్లీలో తాకట్టుపెట్టారని ఆక్షేపించారు. కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించి అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని తెలిపారు.