రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం – రాయాల నాగేశ్వరరావు
కూసుమంచి సెప్టెంబర్ 2 ( జనం సాక్షి ) : దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీతోనే సుమారుగా 60 సంవత్సరాలు దేశాభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి సాధ్యమైందని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలేరు నియోజకవర్గం ఇంచార్జ్ రాయల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రోజున మండలంలోని అనేక గ్రామాలలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రివర్యులు రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. నాయకన్ గూడెం, పాలేరు, జుజ్జులరావుపేట, గట్టుసింగారం, పెరిక సింగారం గ్రామాలలో రాయల నాగేశ్వరరావు పర్యటించి ఆ గ్రామాలలో రాజశేఖర్ రెడ్డి కి నివాళులర్పించారు. గట్టుసింగారం గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసి న జెండా దిమ్మె పై కాంగ్రెస్ జెండా ను ఆవిష్కరించిి అనంతరం రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని అటువంటి ప్రభుత్వాలను ఇంటికి పంపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి పేద ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధిలో నడిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన ఉద్ఘాటించారు. అనంతరం గ్రామ కూడలిలో పులిహోర పంచారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మట్టే గురవయ్య , పోటు లెనిన్, మంకెన వాసు, సైదా, వీరన్న, నాగయ్య, తుపాకుల వెంకన్న, కాంతారావు, వివిధ గ్రామాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.