రాష్ట్ర ఈము పక్షుల పెంపకందారుల మహాసభకు విశేష స్పందన
హైదరాబాద్: నగరంలోని నాగోల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈము రైతుల ఆధీకృత సమాఖ్య ప్రథమ వార్షికోత్సవ మహాసభను ఈరోజు నిర్వహించారు. జిల్లాల నుంచే కాక ఇతర రాష్ట్రాలనుంచి కూడా రైతులు అధిక సంఖ్యలో ఈ సభకు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి విశ్వరూప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఈము పక్షుల పెంపకం మొదలెట్టి 15ఏళ్ళు గడుస్తున్నా రైతుల శ్రేయస్సు కోసం కృషిచేయలేకపోయామని మంచి ధర సౌకర్యాల కల్పన తదితరాల గురించి సీఎం దృష్టికి తీసుకేళ్తామని అన్నారు. ఈము మాంసం కేజీకి రూ. 450 నిర్ణయించాలని నగరంలోని శాంతినగర్‌లో నెలరోజుల్లో ఈము మాంసపు స్టాల్ ఏర్పాటు చేయనున్నట్లు పశు సంవర్థక శాఖ మంత్రి విశ్వరూవ్ అన్నారు.