రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకోసం ప్రత్యేక జెట్ విమానం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకోసం ప్రత్యేక జెట్ విమానాన్ని లీజుకు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. సాధారణ విమానాల రాకపోకల సమయానికి వీవీఐపీ రాకపోకల షెడ్యూల్‌కు పొంతన కుదరని సమస్యల వల్ల కొత్త ఎయిర్ క్రాఫ్ట్‌లతో పరిష్కారం కాగలదని ప్రభుత్వం భావిస్తోంది. తమిళనాడు, మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, రాష్రాలు జెట్ విమానాన్ని కొనుగోలు చేయగా ప్రభుత్వం మాత్రం దీనిని లీజుకు తీసుకోవడం ద్వారా ఖర్చు తగ్గుతుందని భావిస్తోంది.