రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధించను: మోదుగుల
గుంటూరు: రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధించబోనని నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబును తెలంగాన విషయంలో అనుకూలంగా లేఖ రాయెద్దని సీమాంధ్ర ప్రాంత సభ్యులంతా కోరుతామని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంత సాగునీటి ప్రజెక్టులు తాగునీటి వనరులుగా మారిపోయే ప్రమాదం ఉందన్నారు. సమైక్యాంద్ర కోసం తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.