రాష్ట్ర స్థాయి జిజ్ఞాస పోటీలకు  ఎంపికైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు

రాష్ట్ర స్థాయి జిజ్ఞాస పోటీలకు  ఎంపికైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులుకాగజ్ నగర్ రూరల్:(జనం సాక్షి)04 ఏప్రిల్ 2023′ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులలో పరిశోధనా నైపుణ్యాలను పెంపొందించడానికి కళాశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న “జిజ్ఞాస విద్యార్థి ప్రాజెక్టు”పోటీలలో కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రూపొందించిన బోటని,రసాయన శాస్త్రం, ఇంగ్లీషు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డి.లక్ష్మినరసింహం తెలిపారు‌.కాగజ్‌నగర్‌ పరిసర ప్రాంత అడవులలో లభించే గిరిజనులు ఉపయోగించే ఔషద మొక్కలపై వృక్షశాస్త్ర అధ్యాపకుడు వి.దేవెందర్ పర్యవేక్షణలో, సిల్వర్ నానో పార్టికిల్స్ సంశ్లేషణ పై రసాయన శాస్త్ర అధ్యాపకురాలు ఇ.శారద పర్యవేక్షణలో, నిత్యజీవితంలో ఆంగ్లం ఆవశ్యకతపై జె.ప్రేమ్ కుమార్ నేతృత్వంలో విద్యార్థులు రూపొందించిన పరిశోధన ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.వీరు త్వరలో హైదరాబాదులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని తమ ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు.ఇందులో ఎంపికైన వారికి 25000 నగదు పారితోషికం అందనుంది.ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను,వారికి మార్గదర్శకత్వం వహించిన అధ్యాపకులను ప్రిన్సిపాల్ మరియు ఇతర అధ్యాపకులు అభినందించడం జరిగింది.