రాహుల్‌కు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పదవి ఇవ్వండి
హైదరాబాద్: యువనేత రాహుల్‌గాంధీకి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పదవి ఇవ్వాలని మాజీ మంత్రి శంకర్‌రావు కోరారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు. గ్రామీణుల కష్టాలపై రాహుల్‌కు అవగాహన ఉందని ఆయనకు ఆ శాఖ బాధ్యతలు అప్పగించాలని కోరారు. ప్రస్తుత సమయంలో రాహుల్ నిర్ణయం మంచి నిర్ణయమని తామంతా సంతోషిస్తున్నట్లు శంకర్‌రావు అన్నారు.