రాహుల్ గాంధీ అనర్హత వేటు ను తీవ్రంగా ఖండించిన – సం

డ్రరాహుల్ గాంధీ అనర్హత వేటు ను తీవ్రంగా ఖండించిన – సం డ్ర

పెనుబల్లి, మార్చ్25(జనం సాక్షి)రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్నిసత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీవ్రంగా ఖండించారు,భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఆ రోజుచీకటిరోజు అని అన్నారు, రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి, పరాకాష్ట అన్నారు, రాజ్యాంగబద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన  పార్లమెంట్ ను సైతం తమ హేయమైన చర్యలకోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయ మని అన్నారు,  ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింద ని అన్నారు, మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతున్నదని,  ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయిందని అన్నారు,నేరస్థులు, దగాకోరుల కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నార ని అన్నారు,పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదని అన్నారు,దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బిజేపి ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ కలిసి కట్టుగా ముక్తకంఠంతో ఖండించాలని అన్నారు, బిజేపి దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలని బి జె పి వ్యతిరేక పార్టీలకు పిలుపునిచ్చారు.